అక్షరటుడే గాంధారి : ATM Theft | గాంధారి మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం కేంద్రంలో చొరబడి చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ATM Theft | స్కార్పియోలో వచ్చి..
కామారెడ్డి– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఎస్బీఐ ఏటీఎం (SBI ATM) ఉంది. శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో దొంగలు వచ్చారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఎంత మొత్తం నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. అనంతరం దొంగలు పరారు అయ్యారు. పూర్తి వివరాల కోసం స్థానిక ఎస్సై మహేందర్‌కు పలుమార్లు చరవాణిలో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది దుర్మరణం.. 300 మందికి పైగా గాయాలు!