PM Modi Chennai visit | మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చెన్నైలో పర్యటించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Chennai visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చెన్నైలో పర్యటించారు. సుమారు రూ. 4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు.

ప్రధాని మోదీ పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్​తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. NH-744లోని 36 కిలోమీటర్ల, నాలుగు లేన్ల వడుగపట్టి-తేర్కువెంగనల్లూరు విభాగాన్ని ప్రారంభించనున్నారు. NH-83లోని నాగపట్టణం-తంజావూరు విభాగంలో నాలుగు లేన్ల తిరువారూర్ బైపాస్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ. 750 కోట్లకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

PM Modi Chennai visit | ఓడరేవు ప్రాజెక్టులకు..

ప్రధానమంత్రి సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సరుకు రవాణా సామర్థ్యాన్ని విస్తరించడానికి ఓడరేవు సంబంధిత ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. చెన్నై పోర్టులో నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇవి అందుబాటులోకి వస్తే సరుకు నిల్వ, నిర్వహణ మెరుగు పడనుంది. గోదాముల సామర్థ్యం పెరగనుంది.

దీనిని కూడా చదవండి : Hyderabad Police Inspector Case | పెళ్లి పేరిట నమ్మించి మోసం..  ఖైరతాబాద్ డీఐపై కేసు నమోదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *