అక్షరటుడే వెబ్‌డెస్క్: Mudda Pappu Bathukamma | తెలంగాణ ( Telangana ) సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. నవరాత్రుల వేడుకల్లో భాగంగా మొదటి రోజైన ‘ఎంగిలి పూల బతుకమ్మ’, రెండో రోజైన ‘అటుకుల బతుకమ్మ’ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇక తొమ్మిది రోజుల ఈ పూల పండుగలో చివరి ఘట్టమైన ‘సద్దుల బతుకమ్మ’ వరకు ఈ సంబరాలు జరుగుతాయి.
Mudda Pappu Bathukamma | ‘ముద్దపప్పు బతుకమ్మ’..
ఈ పవిత్ర దినాన మహిళలు చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం వంటి రంగురంగుల సుగంధ పుష్పాలను సేకరిస్తారు. తామర పాత్రల్లో మూడంతరాల రూపంలో బతుకమ్మను ఎంతో కళాత్మకంగా పేర్చి, నడిమధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్టిస్తారు.
Mudda Pappu Bathukamma | నైవేద్యాలు..
ఈ మూడో రోజు అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలు కలిపి ‘చలివిడి’ ముద్దలను లేదా రుచికరమైన గారెలను ప్రసాదంగా తయారు చేసి నివేదిస్తారు. సాయంత్రం వేళ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, ఉత్సాహంగా ఆడిపాడతారు. ఆ తర్వాత బతుకమ్మలను సమీపంలోని చెరువుల్లో భక్తితో నిమజ్జనం చేస్తారు.
నిమజ్జనం అనంతరం సత్తుపిండి, పెసర్లు, చక్కెర లేదా బెల్లం కలిపిన ప్రసాదాన్ని ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటూ ఈ వేడుకను ఆనందంగా ముగిస్తారు.
ఇది కూడా చదవండి: Eagle Force | గోవా నుంచి డ్రగ్స్ రవాణా.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్ ఫోర్స్