Bathukamma Celebrations | బాన్సువాడ, చందూర్​లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ సంబరాలు బాన్సువాడ పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Bathukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు బాన్సువాడ(Banswada) పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని 1000 డబుల్ బెడ్‌రూం కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి.

Bathukamma Celebrations | ప్రభుత్వ సలహాదారు పోచారం..

ఈ వేడుకల్లో వేడుకలకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యం చేస్తూ కోలాటలాడారు. బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం కాలనీలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

bans

ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మంటలు..అత్యవసర ల్యాండింగ్‌.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *