అక్షరటుడే, మెండోరా: Sri Ram Sagar Project | ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sri Ram Sagar Project) నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటిమట్టం పడిపోతుంది.
సోమవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 1,079.70 అడుగులకు చేరగా, 44.266 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని సమాచారం. మరోవైపు ప్రాజెక్టు నుంచి వివిధ అవసరాల కోసం మొత్తం 9,152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉంది.
Sri Ram Sagar Project | కాలువలకు నీటి విడుదల
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 521 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సరస్వతి కెనాల్‌కు 670 క్యూసెక్కులు, అలీసాగర్‌కు 540 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్‌కు 285 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల పథకానికి 405 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 6,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 9,152 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తోంది.
Sri Ram Sagar Project | గతేడాది కంటే తక్కువగా
గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 1,091 అడుగులు ఉండగా, ప్రస్తుతం నీటిమట్టం గణనీయంగా తక్కువగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని రైతులు సక్రమంగా, పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Durga Navratri | కొలువుదీరిన దుర్గమ్మ.. తొలి రోజు అంగరంగ వైభవంగా పూజలు