అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra Unemployed Protest | ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 10 రోజులుగా మహారాష్ట్రలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు శాంతించారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.
నియామక సంస్థలో అవకతవకలపై విచారణ జరిపేందుకు, సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం కమిటీ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు తాను సెలవుపై వెళ్తున్నట్లు మహారాష్ట్ర (Maharashtra) పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ వివేక్ భీమన్వర్ ప్రకటించారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. మంత్రి శివేంద్ర రాజే భోసలే నేతృత్వంలో బృందం ఆందోళన చేస్తున్న అభ్యర్థులను కలిసింది. కమిటీ ఏర్పాటుతో వారి డిమాండ్లకు అంగీకరించింది.
Maharashtra Unemployed Protest | భీమన్వర్ను తొలగించాలని..
ఎంపీఎస్సీ ఛైర్మన్ భీమన్వర్ను తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ రాజీనామా ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, విచారణ పూర్తయ్యే వరకు భీమన్వార్ను ఛైర్మన్ పదవికి దూరంగా ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే దీనిని కొందరు నిరసనకారులు వ్యతిరేకించారు. రాజీనామా చేసే వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ సీఎంతో సమావేశం అయ్యారు. అనంతరం తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Bullet Train | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, పుణెకు హైస్పీడ్ రైలు కారిడార్లు.. దక్షిణ భారత రవాణా ముఖచిత్రం మారనుందా?