Prajavani Complaints | కలెక్టరేట్​లో ప్రజావాణికి 89 ఫిర్యాదులు

నగరంలోని కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | నగరంలోని కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో సహా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

Prajavani Complaints | 89 ఫిర్యాదులు..

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్​ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు స్వీకరించామని కలెక్టర్​ తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Chimrajpalli Tungen Road | చింరాజ్​పల్లి నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *