Nizamabad Electric Shock | నగరంలో విషాదం.. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో మహిళ మృతి

నగరంలో విషాదం నెలకొంది ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Electric Shock | నగరంలో విషాదం నెలకొంది. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Nizamabad Electric Shock | హమాల్​వాడిలో..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని మిర్చికాంపౌండ్​లో ఉదయం ట్రాన్స్​ఫార్మర్​ వద్దకు వెళ్లిన మహిళకు విద్యుత్​షాక్​ తగిలింది. ఈ ధాటికి మహిళ ముక్కులుమక్కలైంది. భారీ శబ్ధం రావడంలో ఉలిక్కిపడ్డ స్థానికులు వచ్చి చూసేసరికి మహిళ మృతి చెందిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతిచెందిన మహిళను పాత సామాన్లు సేకరించే మహిళగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nandi Gutta Mining | నంది గుట్టను మైనింగ్‌ నుంచి రక్షించాలి : కలెక్టర్‌కు బోడ మహేందర్‌ విజ్ఞప్తి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *