అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్లో ఉన్న సయ్యద్ అలీకి చెందిన ఫర్నిచర్ గోదాములో మంటలు చెలరేగాయి.
Hyderabad Fire Accident | కాలిపోయిన గోదాములు
అపార్ట్మెంట్లు, నివాస గృహాల మధ్య ఉన్న ఈ గోదాములు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తప్పాచబుత్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Abdullapurmet ACB Raid | రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్