అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPI MDR Charges | యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ఛార్జీలపై కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జీల వసూలను వాయిదా వేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలకు మించి వ్యాపారులకు జరిపే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అయితే దసరా, దీపావళి నేపథ్యంలో ఛార్జీలు అమలులోకి వస్తే తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందారు. ఈ మేరకు కేంద్రాన్ని కలిసి విన్నవించారు. దీంతో దీపావళి తర్వాత ఎండీఆర్ ఛార్జీలను వసూలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) నిర్ణయించింది. కొత్త అమలు తేదీని తర్వాత తెలియజేస్తామని పేర్కొంది.
UPI MDR Charges | పండుగ ఉండటంతో..
పండుగ సమయంలో ప్రజలు ఎక్కువగా షాపింగ్ చేస్తారు. వినియోగదారుల ఖర్చు సాధారణంగా పెరుగుతుంది. దీంతో చెల్లింపు సంస్థలకు, వినియోగదారులకు వారి సిస్టమ్‌లను అప్డేట్ చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వడానికి, పండుగ సీజన్లో ఈ మార్పును ప్రవేశపెట్టడంపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ అమలును ఆలస్యం చేశారు.
ఇది కూడా చదవండి : Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. రూ.1.53 లక్షల బోనస్