Hangarga Panchayat Secretary | జీపీ కార్యదర్శి నిర్బంధం.. అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తుల ఆరోపణ

అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జీపీ కార్యదర్శిని గ్రామస్తులు నిర్బంధించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి: Hangarga Panchayat Secretary | అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జీపీ కార్యదర్శిని గ్రామస్తులు నిర్బంధించారు. ఈ ఘటన పోతంగల్ (Potangal)​ మండలంలోని హంగర్గా గ్రామంలో మంగళవారం జరిగింది.

Hangarga Panchayat Secretary | రూ.5 లక్షల గోల్​మాల్​

గ్రామస్తులు మాట్లాడుతూ.. జీపీ తీర్మానాలను పట్టించుకోకుండా కార్యదర్శి కొందరి వద్ద డబ్బులు తీసుకుని ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే గ్రామపంచాయతీ (Panchayat) నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.  ఈ విషయంపై ఆగ్రహించిన ప్రజలు మంగళవారం జీపీ కార్యదర్శిని నిర్బంధించారు. సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ.. పది నెలల జమాఖర్చుల విషయంలో గ్రామసభలో పొంతన లేకుండా ఖర్చులు చూపించారన్నారు. అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.

రూ.5లక్షల వరకు గోల్​మాల్​ జరిగినట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఇల్లు లేని వారికి, ఖాళీ స్థలాలు ఉన్నవారికి, పేరు మార్పిడి కోసం వస్తే వారి వద్ద డబ్బులు తీసుకుంటూ జీపీకి నష్టం చేకూర్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల నుండి సుమారు రూ.40వేల నుండి రూ.50వేల వరకు బ్యాంకులో జమల చేయకుండా వాడుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. రసీదు పుస్తకంలో రసీదులను మధ్య, మధ్యలో చింపుతూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు అతన్ని వదిలేది లేదని గ్రామస్తులు జీపీకి తాళం వేసి పంచాయతీ ముందు బైఠాయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Hangarga Panchayat Secretary |

ఇది కూడా చదవండి: 20న ఆది సాయికుమార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *