అక్షరటుడే, వెబ్‌బెస్క్ : CJP Leaders | జంతర్‌మంతర్ వద్ద అక్రమంగా ప్రవేశించినందుకు సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని బుధవారం కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 5 రోజుల జైలు శిక్ష విధించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జంతర్‌మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రాంతాల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం పలువురు సీజేపీ నాయకులు జంతర్‌మంతర్ వద్దకు వచ్చారు. బారికేడ్లను దూకి వెళ్లి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు అజింక్య షిండేపై కూడా బాండ్ ఉల్లంఘన, ప్రభుత్వ అధికారి విధికి ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.
CJP Leaders | తీహార్ జైలుకు తరలింపు
సీజేపీ నాయకులను బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ (Delhi)లోని మందిర్ మార్గ్‌లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 5 రోజుల రిమాండ్ విధించారు. కాగా ఇటీవల వీరు రూ.50 వేల పూచికత్తుపై షరతులతో కూడిన బెయిల్ పొందారు. దానిని ఉల్లంఘించడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం పోలీసులు వారిని తీహార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి..: nandan Nilekani AI exams | పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేలా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పరీక్ష రోజునే ప్రశ్నపత్రం! : నందన్ నీలేకని కీలక ప్రకటన