Power Supply | అంతరాయం లేకుండా విద్యుత్​ సరఫరా : డిప్యూటీ సీఎం భట్టి

అంతరాయం లేకుండా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Power Supply | అంతరాయం లేకుండా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్​ నుంచి ఆయన విద్యుత్​ శాఖ అధికారులతో మంత్రి శ్రీధర్​బాబు (Minister Sridhar Babu)తో కలిసి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఎల్​ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్​ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించాను. వ్యవసాయం, గృహావసరాలు, పరిశ్రమలకు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Power Supply | బొగ్గు కొనుగోలుకు సహకారం

విద్యుత్​ ఉత్పత్తికి తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనపు బొగ్గు కొనుగోలుకు ప్రభుత్వం నిధుల కొరత లేకుండా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్నారు.

ఇది కూడా చదవండి..: hyderabad vijayawada highway | హైదరాబాద్ – విజయవాడ హైవేకు మహర్దశ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *