SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పోచంపాడ్: SRSP Water Release | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) వరద కాలువ ద్వారా బుధవారం నీటి విడుదలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..

SRSP Water Release | రోజు 5వేల క్యూసెక్కులు..

రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. జగదీష్ తెలిపారు. 1,091 అడుగుల గరిష్ట నీటిమట్టం సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1,079 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వరద కాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎస్‌ఈ సూచించారు.

ఇది కూడా చదవండి..: Forest Officers Attack | అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురు అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *