అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Development Programs | రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని కొక్కొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు.
Yellareddy Development Programs | మహిళా భవనం ప్రారంభం..
ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనంతో పాటు, వానాకాలం (ఖరీఫ్) 2026–27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘ భవనం మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి స్పందించి, ఇచ్చిన హామీని నెరవేర్చి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు మహిళా సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Yellareddy Development Programs | వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
అనంతరం గ్రామంలో వానాకాలం (ఖరీఫ్) 2026–27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం గుర్తించిన 7 సన్న రకాల ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ చెల్లించడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Voter Registration | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు..