Constable Raghu | కానిస్టేబుల్ రఘు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Constable Raghu | విధి నిర్వహణలో ఉండగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కామారెడ్డి (Kamareddy) జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి (MLA Pocharam Srinivas Reddy) బుధవారం వినతిపత్రం సమర్పించింది.

Constable Raghu | గాంధారి పోలీస్​స్టేషన్​లో..

కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (Police Welfare Telangana) అధ్యక్షుడు కె. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధారి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కె.రఘు జూన్ 9న అనారోగ్య కారణాలతో మరణించడం పోలీస్ శాఖకు, ఆయన కుటుంబానికి తీరని లోటన్నారు. ఆయన మరణంతో కుటుంబానికి ఏర్పడిన ఆర్థిక, సామాజిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆయన భార్య రజనికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.

Constable Raghu | రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

అనారోగ్య కారణాలతో మరణించిన రఘు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ మంజూరైంది. ఈ సందర్భంగా బుధవారం బాన్సువాడ పట్టణంలో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ప్రతినిధులు అందించిన రూ.50 లక్షల చెక్కును ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రఘు భార్య రజనికి అందజేశారు.

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఇన్సూరెన్స్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని, విధి నిర్వహణలో ఉన్న ప్రతి పోలీస్ ఉద్యోగి తన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన బీమా రక్షణ పొందడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మరణించిన కానిస్టేబుల్ రఘు కుటుంబానికి అండగా నిలుస్తూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందేలా సహకరించిన టాటా ఏఐఏ బృందానికి కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శంకర్, వినీత, ప్రణీత, సతీష్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ లైవ్‌లో హత్య.. నిందితుడి అరెస్ట్..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *