GST Collections | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: GST Collections | దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏప్రిల్ నెలలో 8.7 శాతం వృద్ధితో రూ.2.43 లక్షల కోట్ల మేర వసూళ్లు అయ్యాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2026లో మొత్తం స్థూల జీఎస్​టీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే (YoY) 8.7 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే నెలలో రూ. 2,23,265 కోట్లు వసూలు కాగా.. ఈ సారి ఆదాయం రూ.2,42,702 కోట్లకు చేరుకుంది. దిగుమతులకు సంబంధించిన పన్నుల వసూళ్లలో వచ్చిన భారీ పెరుగుదల ఈ వృద్ధికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

GST Collections | దిగుమతులతోనే..

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దేశీయ వసూళ్ల కంటే దిగుమతి సంబంధిత వసూళ్లే అధిక వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతుల ద్వారా వచ్చిన రూ. 57,580 కోట్ల స్థూల ఆదాయం వచ్చింది. గతేడాది ఏప్రిల్​లో ఇది రూ.45,754 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 25.8 శాతం పెరగడం గమనార్హం. స్థూల దేశీయ ఆదాయం 4.3 శాతం వృద్ధి చెంది రూ.1,85,122 కోట్లకు చేరుకుంది.

GST Collections | రూ.2.10 లక్షల కోట్లు

మొత్తం దేశీయ ఆదాయంలో కేంద్ర జీఎస్​టీ రూ. 52,140 కోట్లు, రాష్ట్ర GST రూ. 61,331 కోట్లుగా ఉంది. ఐజీఎస్​టీ రూ.71,651 కోట్లు వసూల్​ అయింది. వాపసులను సర్దుబాటు చేసిన తర్వాత ఏప్రిల్ 2026 నాటికి నికర ఆదాయం రూ. 2,10,909 కోట్లు అని అధికారులు తెలిపారు.

GST Collections | ఈ రాష్ట్రాలు టాప్..

గణాంకాల ప్రకారం పలు రాష్ట్రాలు ఎస్​జీఎస్​టీ వసూళ్లలో భారీగా వృద్ధి నమోదు చేశాయి. మహారాష్ట్ర 40 శాతం, కర్ణాటక 42 శాతం, తెలంగాణ (Telangana) 36 శాతం, పుదుచ్చేరి 108శాతం వృద్ధితో వసూళ్లు రాబట్టాయి. అదే సమయంలో లడఖ్ వృద్ధి మైనస్​ 8శాతంగా ఉంది. జార్ఖండ్​లో సున్న శాతం నమోదు కాగా.. కొన్ని రాష్ట్రాలు క్షీణతను లేదా ఎటువంటి మార్పు లేకపోవడాన్ని నమోదు చేశాయి. మార్చిలో స్థూల జీఎస్​టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి..: Pawan Khera Bail | కాంగ్రెస్​ నాయకుడు పవన్​ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *