Indian Stock Market Rally | బుల్స్ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market Rally | గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా.. ఆసియా మార్కెట్లు సెల్ ఆఫ్‌నకు గురవుతున్నా బ్లూ చిప్స్ స్టాక్స్ మద్దతుతో బుల్స్ పైచేయి సాధించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల ర్యాలీతో ప్రధాన సూచీలు భారీగా లాభపడ్డాయి. జియో ప్లాట్‌ఫాం ఐపీవోతో వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో బలమైన కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

Indian Stock Market Rally | ఇతర మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి..

ఆర్టిఫిషియల్ స్టాక్స్‌లో అధిక వాల్యూయేషన్లతో ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సౌత్ కొరియా, జపాన్, తైవాన్, చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు సెల్లాఫ్‌నకు గురయ్యాయి. భారత్‌లో ఏఐ ట్రేడ్ లేకపోవడం, దేశీయ సంప్రదాయ ఐటీ సెక్టార్ రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో మన సూచీలు భారీ లాభాలను అందించాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం భారీగా పడిపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి.

Indian Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 184 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా మొదట్లో 69 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 1,434 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 34 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 419 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,533 పాయింట్ల లాభంతో 74,315 వద్ద, నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 22,997 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,720 కంపెనీలు లాభపడగా 2,668 స్టాక్స్ నష్టపోయాయి. 203 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 114 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 4.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.17 శాతం, రిలయన్స్ 4.03 శాతం, ఎయిర్‌టెల్ 2.94 శాతం, ఎటర్నల్ 2.77 శాతం పెరిగాయి.

Losers  : బీఈఎల్ 0.60 శాతం, ట్రెంట్ 0.58 శాతం, హెచ్యూఎల్ 0.15 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Zetwerk IPO | పబ్లిక్ ఇష్యూకు టెక్నాలజీ బేస్‌డ్ కంపెనీ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *