Oct 16 Market Analysis | గ్రీన్​లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 16 Market Analysis | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వ్యాపారంపై ఆందోళనల కారణంగా చిప్ స్టాక్‌లలో గత సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

భారీ సెల్లాఫ్ తర్వాత వాల్యూయేషన్స్ ఆకర్షణీయంగా మారడంతో శుక్రవారం(Friday) ఉదయం వాల్యూ బయ్యింగ్‌కు దిగడంతో తిరిగి ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి.

Oct 16 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.08 శాతం, ఎస్ అండ్ పీ 0.33 శాతం పెరగ్గా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.05 శాతం లాభంతో ఉంది.

Oct 16 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.33 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.78 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.07 శాతం పెరిగాయి.

Oct 16 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.49 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.45 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.89 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.50 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.47 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.42 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: ram sugar rani rajput | ఏడు పదుల ప్రేమామృతం.. రీల్స్ మహిమో, ఆస్తుల మహత్యమో!

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 15వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 5,285 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 46 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,319 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి 95.05 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.48 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.01 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.09 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.91 నుంచి 1.37కు పెరిగింది.
  • విక్స్ 4.1 శాతం తగ్గి 14.02 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *