అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reliance Joyland Milk | పానీయాల మార్కెట్లో ఇప్పటికే కాంపా కోలా బ్రాండ్‌తో పోటీ ఇస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు డెయిరీ రంగంలోకీ ప్రవేశించింది. తమిళనాడు (Tamil Nadu)లో రూ. 20 ధరతో ‘జాయ్‌ల్యాండ్’ బ్రాంద్తో ఫ్లేవర్డ్ మిల్క్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది.
దీనిని దేశంలోని ఇతర ప్రాంతాలలో దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. కస్టమర్లకు అందుబాటు ధరలో పాల ఉత్పత్తులను అందించడమే లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. ఈ ఫ్లేవర్డ్ మిల్క్‌ను నిజమైన పాల పదార్థాలతో తయారు చేస్తామని పేర్కొనడం గమనార్హం.
Reliance Joyland Milk | రెండు రుచుల్లో..
జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్‌ను రెండు ఫ్లేవర్లలో అందుబాటులోకి తెచ్చారు. స్ట్రాబెర్రీ, వెనీలా రుచుల్లో విడుదలయ్యింది. భవిష్యత్తులో ఈ కొత్త బ్రాండ్ కింద మరిన్ని ఫ్లేవర్లు, పాల ఉత్పత్తులను తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఉన్న పటిష్టమైన పంపిణీ వ్యవస్థ, వినియోగదారుల అవగాహన తమ ఉత్పత్తులు ప్రాచుర్యం పొందడానికి తోడ్పడతాయని కంపెనీ భావిస్తోంది. కాగా ‘జాయ్‌ల్యాండ్’ ఇప్పటికే మార్కెట్లో ఉన్న అమూల్, ఐటీసీ, మదర్ డెయిరీ, నందిని వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి..: Gold Rates Today | పసిడి కొనుగోలుదారులకు మరింత ఊరట.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే!