Bodhan Bar License | బార్​ ఏర్పాటు కోసం కలెక్టరేట్​లో లక్కీడ్రా

బోధన్ పట్టణంలో నూతనంగా మంజూరైన బార్​ కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan Bar License | బోధన్ పట్టణంలో (bodhan) నూతనంగా మంజూరైన బార్​ కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Bodhan Bar License | ఒక బార్​కు 19 దరఖాస్తులు..

బార్ లైసెన్సు కోసం మొత్తం 19 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీసి బార్ కేటాయింపు కోసం లైసెన్స్ ఖరారు చేశారు. లక్కీడ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, సూపరింటెండెంట్ నందగోపాల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కర్ తదితర అధికారులు లక్కీ డ్రా నిర్వహణ ప్రక్రియలో పాల్గొన్నారు.

43455

ఇది కూడా చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరలు మారుతాయా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *