అక్షరటుడే, పెద్దకొడప్గల్: Katepally Power Substation | మండలంలో విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. కాటేపల్లి గ్రామం (Katepalli Village)లో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్తో కలిసి భూమిపూజ చేశారు.
Katepally Power Substation | అంతరాయాలను తగ్గించేందుకు..
పెద్దకొడప్గల్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న అంతరాయాలను తగ్గించి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో కాటేపల్లిలో నూతన సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూతన సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతులకు వ్యవసాయ, రోజువారీ గృహావసరాల కోసం మెరుగైన విద్యుత్ సేవలు అందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకొడప్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..