Stock Market Closing Today | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. శుక్రవారం సెన్సెక్స్ 413 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Closing Today | దేశీయ స్టాక్ మార్కెట్ ఈవారం ఇతర మార్కెట్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. ఏఐ ట్రేడ్ బలహీనపడడం, రాబోయే బడ్జెట్‌లో ఎల్టీసీజీ పన్నుల విధానంలో మార్పులు వస్తాయనే అంచనాలు, ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్లు, బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు బాగుండడం, ఆర్బీఐ చర్యలతో రూపాయి బలపడడం వంటి కారణాలతో మన మార్కెట్లు చివరి రెండు రోజుల్లో పరుగులు తీశాయి.

Stock Market Closing Today | ఫ్లాట్‌గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కొద్దిసేపటికే ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ పైకి పరుగులు తీశాయి. ఉదయం సెన్సెక్స్ 26 పాయింట్ల స్వల్ప లాభంలో ప్రారంభమైనా మొదట్లో లాభాల స్వీకరణతో 329 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 766 పాయింట్లు పెరిగింది. 68 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మొదట్లో 152 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని 236 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 413 పాయింట్ల లాభంతో 74,729 వద్ద, నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 23,146 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Closing Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,404 కంపెనీలు లాభపడగా 1,962 స్టాక్స్ నష్టపోయాయి. 250 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 127 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 8.45 శాతం, టీసీఎస్ 4.61 శాతం, ఇన్ఫోసిస్ 4.55 శాతం, ఎయిర్‌టెల్ 2.86 శాతం, ఎం అండ్ ఎం 2.38 శాతం పెరిగాయి.

Top Losers : ఇండిగో 2.23 శాతం, రిలయన్స్ 1.09 శాతం, ఆసియన్ పెయింట్ 1.00 శాతం, బీఈఎల్ 0.71 శాతం, ఐటీసీ 0.66 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Jio Starlink Competition | శాటిలైట్ స్పెక్ట్రమ్ వార్.. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌పై రిలయన్స్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *