Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..

కాపురానికి రావట్లేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్య దాడి చేశాడు. అంతేకాదు మామపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన నగరంలోని (Nizamabad) వినాయక్​నగర్ (Vinayak nagar)​లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Nizamabad Police | వినాయక్​నగర్​లో..

నాల్గో టౌన్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మధుకర్​కు నగరంలోని వినాయక్​నగర్​కు చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తిరిగి వినాయక్​నగర్​లోని తన పుట్టింట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఇంటికి వచ్చిన భర్త మధుకర్​ కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన మధుకర్​ కత్తితో భార్య, మామపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని జీజీహెచ్​కు తరలించారు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్​ ఎస్​హెచ్​వో సతీష్​ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం మామ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఐస్ బాత్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *