Kamareddy Power Cuts | కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు..: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

ప్రభుత్వానికి కాళేశ్వరంపై విమర్శలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు కరెంట్ సరఫరా చేయడంలో లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Power Cuts | ప్రభుత్వానికి కాళేశ్వరంపై విమర్శలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు కరెంట్ సరఫరా చేయడంలో లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. శనివారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి (Kamareddy) విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ కోతలపై ధర్నా చేపట్టారు.

Kamareddy Power Cuts | ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..

ఈ సందర్భంగా కేవీఆర్​ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ముందు చూపు లేకనే విద్యుత్ కోతలని విమర్శించారు. ఎల్​నినో వల్ల సమస్య ఉంటుందని ఆర్నెళ్ల క్రితమే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పంటకు నీళ్లు ఇవ్వాలని, యాసంగి పంటకి ప్రణాళిక తయారు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి..: Yendamuri Varaprasad Death | సీనియర్ పాత్రికేయుడు యండమూరి వరప్రసాద్ కన్నుమూత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *