Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (BJP mla dhannpal) తెలిపారు. మహిళ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ (disabled welfare) ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం వికలాంగులకు ప్రత్యేక వాహనాలను (vehicle distributi) అందజేశారు.

Disabled Vehicle Distribution | ఎట్టకేలకు మోక్షం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ వాహనాలకు మోక్షం కలిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ వాహనాలు అందేలా చొరవ చూసుకోవాలని పేర్కొన్నారు. తాను సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కు కలిసి లేఖను అందజేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక పథకాలను అందజేస్తుందని చెప్పారు. ప్రత్యేక పరికరాలతో పాటు రెండు లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మ, ప్రాజెక్ట్ అధికారి సౌందర్య, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, న్యాలం సునీత రాజు, మురళి జ్యోతి, శశాంక్, నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *