Nizamabad Aadhaar Services | బాధ్యతాయుతంగా ఆధార్ సేవలు నిర్వహించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజలకు బాధ్యతాయుతంగా ఆధార్​ సేవలను అందించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Aadhaar Services | ప్రజలకు బాధ్యతాయుతంగా ఆధార్​ సేవలను అందించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. నగరంలోని వర్నీరోడ్​లోని కోటగల్లీ మున్నూరుకాపు సంఘం భవనంలో ఆధార్​ సేవలను ప్రారంభించారు.

Nizamabad Aadhaar Services | ఆధార్​ సేవల వికేంద్రీకరణ..

రాష్ట్రంలో హైదారాబాద్​లో ఆధార్​ ప్రత్యేక సేవలను ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యతగా బాధ్యతాయుతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రజలు, వృద్ధులు, మహిళలు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల వారికి ఓపికగా ఈ సేవలందించాలని సూచించారు. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నకిలీ ఆధార్ నమోదుకు ప్రయత్నించినప్పుడు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆధార్ కేంద్రం పని చేస్తుందన్నారు.

Nizamabad Aadhaar Services | సెలవు దినాల్లోనూ.. ఆధార్​..

ఆదివారం, రెండో శనివారం తదితర పండగల సెలవు దినాల్లో కూడా ఆధార్ కేంద్రం పనిచేస్తుందని కలెక్టర్​ సూచించారు. ఈ కార్యక్రమంలో యుఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఈ గవర్నెన్స్ జిల్లా మేనేజర్ కార్తీక్ కుమార్, ప్రోటీన్ టెక్నాలజీస్ సంస్థ నిజామాబాద్ ఆధార్ సేవాకేంద్రం మేనేజర్ సురేష్ కుమార్, ఏఎస్​కే కామారెడ్డి జిల్లా మేనేజర్ అనిల్ కుమార్, ఆధార్ కేంద్రం ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhari ATM Robbery | సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుల కోసం కొనసాగుతున్న వేట

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *