అక్షరటుడే, ఇందూరు: Khilla Ramalayam Ropeway | దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న ఇందూరు ఖిల్లా రామాలయానికి రోప్‌వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. జిల్లా కేంద్రంలోని (Nizamabad) పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Khilla Ramalayam Ropeway | సమర్థ రామదాసు నిర్మించిన ఆలయం
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయం అన్నారు. ఆలయాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్ల నిధులతో రోప్‌వే నిర్మాణం కానుందని, ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పాలించిన పాలకులు రామాలయ అభివృద్ధిని మరిచారన్నారు. మోదీ ప్రభుత్వం చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే పర్వతమాల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధి కోసం గతంలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో రోప్‌వే మంజూరైనట్లు స్పష్టం చేశారు.
Khilla Ramalayam Ropeway | అనేకసార్లు లేఖలు అందించాం..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖిల్లా రామాలయ అభివృద్ధిపై అనేక సార్లు లేఖలు అందేశామని ధన్పాల్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులను, రోప్ వే కంపెనీ ప్రతినిధులను పంపడం సంతోషకరమన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులపై కూడా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాని నియోజకవర్గం ఇందూరు ఒకటేనని చెప్పారు. సమస్యను మంత్రి పొంగిలేటి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల అర్బన్‌లోని సౌత్ మండల అర్హులకు ఇళ్లను కేటాయించాలని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, విజయ మల్లేష్ యాదవ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, యువ మోర్చా అధ్యక్షుడు వంశీ, యువ మోర్చా రాష్ట్ర సహా కోశాధికారి విజయ్, ఎస్సీ మోర్చా పురుషోత్తం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నమ్మితే నట్టేట ముంచేస్తారు..!సైబర్ నేరగాళ్ల నయా ఎత్తుగడలు