అక్షరటుడే, వెబ్డెస్క్: Padmanagar Durga Bhavani | నిజామాబాద్ Nizamabad నగరంలోని పద్మానగర్ రోడ్డు నంబర్ 1లో శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ, కాలనీ వాసులు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
Padmanagar Durga Bhavani | అమ్మవారి సేవలో భక్తులు
ఉత్సవాల్లో భాగంగా భవానీమాత మాలధారులు నిత్యం అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలుస్తూ భక్తిని చాటుకుంటున్నారు. భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవ ప్రాంగణం భక్తిమయంగా మారుతోంది. అమ్మవారి సేవలో భక్తులు పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలతో పద్మానగర్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.