Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు భారీ స్పందన.. తొలి 36 నిమిషాలలోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభిస్తోంది. తొలి అరగంటలోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యి మెగా ఇష్యూలలో అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఐపీవోకు వచ్చిన మరో కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ను మదుపరులు ఆదరిస్తున్నారు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తొలి 36 నిమిషాల్లోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. తద్వారా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన మెగా ఇష్యూలలో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో అత్యంత వేగవంతమైనదిగా రికార్డు నెలకొల్పింది.

Jio Platforms IPO | భారీ ఐపీవోలలో..

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ మార్కెట్‌నుంచి రూ. 30,213 కోట్లు సమీకరించడం కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చింది. అతిపెద్ద ఐపీవో (IPO) అయినప్పటికీ పూర్తి కోటా నిమిషాల వ్యవధిలోనే సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా యొక్క రూ. 11,605 కోట్ల ఇష్యూ మొదటి రోజు ముగిసేనాటికే పూర్తి సబ్‌స్క్రైబ్ అయ్యింది. రూ. 27,870 కోట్ల ఐపీవోతో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియాకు మొదటి రోజు నామమాత్రపు స్పందన లభించింది. తొలిరోజు 18 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. పెద్ద ఐపీవోలలో తొలిరోజు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 72 శాతం, ఎల్ఐసీ 67 శాతం, ఎన్ఎస్ఈ 43 శాతం, టాటా క్యాపిటల్ 39 శాతం, కోల్ ఇండియా 37 శాతం, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 37 శాతం, పేటీఎం 18 శాతం, స్విగ్గీ 12 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Jio Platforms IPO | మధ్యాహ్నం 1 గంట వరకు..

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో మొత్తం ఇష్యూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1.45 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ 4.13 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 0.59 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 0.47 రెట్లు, వాటాదారులు 0.87 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఉద్యోగుల కేటగిరి దాదాపు సబ్‌స్క్రైబ్ అయ్యింది.

Jio Platforms IPO | 23 వరకు అవకాశం..

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభమైంది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనడానికి అక్టోబర్ 23 వరకు అవకాశం ఉంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవనున్నాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *