అక్షరటుడే, డిచ్పల్లి : Martyrs Remembrance Day | డిచ్పల్లి (Dichpally) ఏడో బెటాలియన్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు.
Martyrs Remembrance Day | వారి సేవలను మరువలేం..
దేశ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కమాండెంట్ సీతారాం పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారు చూపిన మార్గంలో విధి నిర్వహణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: NHM Employees Strike | మా గోస పట్టించుకోరా..? ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన..