అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Dasara Liquor Sales | తెలంగాణలో దసరా పండుగ వేళ మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. పండుగకు ముందు వచ్చిన కేవలం నాలుగు రోజుల పనిదినాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.755 కోట్ల 14 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది దసరా సమయంలో నాలుగు రోజుల్లో రూ.698 కోట్ల అమ్మకాలు జరగగా, ఈసారి ఆ రికార్డు బద్దలైంది.
Telangana Dasara Liquor Sales | రికార్డు స్థాయిలో ..
పండుగ నేపథ్యంలో అక్టోబర్ 19న (పండుగకు ముందు రోజు) మద్యం అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఆ ఒక్క రోజే ఏకంగా రూ.303 కోట్ల 40 లక్షల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అక్టోబర్ 14న రూ. 102.17 కోట్లు, అక్టోబర్ 16న రూ. 126.32 కోట్లు, అక్టోబర్ 17న రూ. 223.25 కోట్లు, ఆ తర్వాత అక్టోబర్ 19న గరిష్టంగా రూ. 303.40 కోట్ల విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 15న డిపోలకు సెలవు కావడం, అక్టోబర్ 18న ఆదివారం కావడంతో ఆ రోజుల్లో అమ్మకాల్లో వ్యత్యాసం కనిపిచింది.
Telangana Dasara Liquor Sales | ఎక్కువగా అమ్ముడైన బీర్లు..
ఈ నాలుగు రోజుల్లో మందుబాబులు బీర్ల ( Beer )వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. మొత్తం 10,44,000 కేసుల బీర్లు, అలాగే 6,83,000 కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడైంది. ఇక అక్టోబర్ నెల మొత్తం మీద పరిశీలిస్తే.. అక్టోబర్ 19 నాటికే ఏకంగా రూ. 2,055 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో రూ. 3,209 కోట్లు, ఆగస్టులో రూ. 3,482 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ జోరుతో ఈ నెలలో ప్రభుత్వానికి మరింత భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
Telangana Dasara Liquor Sales |ఎక్సైజ్ ఆదాయం కీలకం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 వైన్ షాపులు, సుమారు 1,200 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల ద్వారా ఈ విక్రయాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ తర్వాత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేది ఎక్సైజ్ శాఖే కావడం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు, వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించడంలో ఈ మద్యం ఆదాయం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor | నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు