అక్షరటుడే, వెబ్‌డెస్క్: Poonch Explosives Seizure | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని పూంచ్ జిల్లా ఒక గుహలోని ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఉగ్రవాద స్థావరంపై సమాచారం అందడంతో బలగాలు కస్బ్లారి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న గుహను గుర్తించారు. అందులో తనిఖీలు చేయగా.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఆరు ఐఈడీలు, ఒక 7.62 LMG మ్యాగజైన్, ఒక కంబాట్ పౌచ్, ఒక అల్యూమినియం కంటైనర్, విద్యుత్ వనరులతో కూడిన రెండు పవర్ అడాప్టర్లు, టిఫిన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్‌లో బాంబు పెట్టి పేల్చడానికి ప్రణాళిక వేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Poonch Explosives Seizure | బలగాలకు చిక్కకుండా..
జమ్మూ కశ్మీర్లో పోలీసులు, భద్రతా బలగాలు నిరంతరం తనిఖీలు చేపడుతూ.. ఉగ్రవాదుల ఆట కట్టిస్తున్నాయి. దీంతో వారు అడవుల్లోని గుహలను తమ స్థావరాలుగా మార్చుకుంఉటన్నారు. వీటిని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దాచుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఒక సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. స్థానికులు ఆశ్రయం ఇవ్వడం మానేయడంతో, గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఇలాంటి అటవీ రహస్య స్థావరాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kargil War | సొంత సైనికుల మృతదేహాలను తీసుకోని పాక్ : భారత్ విమర్శలు