Ration Dealers | రేషన్​డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా వ్యాప్తంగా రేషన్ల డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్​ డిమాండ్​ చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ration Dealers | జిల్లా (Nizamabad) వ్యాప్తంగా రేషన్ల డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు శుక్రవారం డీఆర్​వోకు వినతిపత్రం అందజేశారు.

Ration Dealers | గౌరవ వేతనం పెంచాలి..

అసోసియేషన్​ అధ్యక్ష, కార్యదర్శులు అతిలమ నాగేష్​, చిట్టి పార్థసారధి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థలో తాము కీలకంగా పనిచేస్తున్నామన్నారు. అయితే చాలీచాలని గౌరవ వేతనంతో ఆర్థికంగా కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా రేషన్​ డీలర్ల కమీషన్​ను పెంచాలన్నారు. దిగుమతి హామాలీని ప్రభుత్వమే భరించాలని కోరారు. ప్రతి రేషన్​ షాప్​నకు ఖచ్చితమైన తూకం వేసి పంపాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *