GO 86 Fire Department | జీవో 86ను రద్దు చేయాలి.. అగ్ని మాపక సిబ్బంది డిమాండ్

ప్రభుత్వం జారీ చేసిన జీవో 86ను రద్దు చేయాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GO 86 Fire Department | ప్రభుత్వం జారీ చేసిన జీవో 86ను రద్దు చేయాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ నగరంలో రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల సంఘం జనరల్ బాడీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.

ఉద్యోగుల హక్కులు, పదోన్నతులు, సీనియారిటీ, సేవా ప్రయోజనాలు, సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి తాత్కాలిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. 2025 జులైలో జారీ చేసిన జీవో 86ను తక్షణమే రద్దు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు, సీనియారిటీ, భవిష్యత్ సేవా ప్రయోజనాలపై ప్రభావం పడుతోందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

GO 86 Fire Department | ప్రాణాలకు తెగించి విధులు

అగ్నిమాపక సిబ్బంది ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని వారు అన్నారు. తమ సేవలను గుర్తించి న్యాయమైన పదోన్నతులు, సేవా హక్కులు కల్పించాలని కోరారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ముందుకు సాగాలని సంఘం పిలుపునిచ్చింది.

GO 86 Fire Department | రాష్ట్ర తాత్కాలిక కమిటీ..

అధ్యక్షుడిగా దామోదర్ రెడ్డి, కార్యదర్శిగా తిరుమల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఆనంద్​ను ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆనంద్ ఎన్నిక కావడం జిల్లాకు గర్వకారణం అని జిల్లా సిబ్బంది అన్నారు.

66 1

దీనిని కూడా చదవండి : El Nino Crisis | వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదు : సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *