Saddula Bathukamma | అంబరాన్నంటిన ఎడపల్లి బతుకమ్మ సంబరం

ఎడపల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Saddula Bathukamma | సద్దుల బతుకమ్మసంబరం తెలంగాణ అంతాటా ముగిసింది. కానీ, నిజామాబాద్​ జిల్లా ఎడపల్లిలో (Yedapally) మాత్రం బతుకమ్మ సంబరానికి ప్రత్యేకత ఉంది.

Saddula Bathukamma | ఎడపల్లిలో అనాదిగా వస్తున్న ఆచారం..

ఎడపల్లి మండల కేంద్రంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఆడపడుచులు ఈసారి కూడా కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగ ముందు రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు.

కానీ, ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం దసరా తర్వాత ఐదు రోజులకు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించారు.

ఎడపల్లి గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా ముస్తాబై తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఆడి పాడారు.

ఇది కూడా చదవండి : అబద్దాలు ఆడడానికి సిగ్గు అనిపిస్తలేదా?- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *