అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Alumni Reunion | కాలం మారినా, దారులు వేరైనా స్నేహబంధానికి హద్దులుండవని పూర్వవిద్యార్థులు నిరూపించారు. నగరంలోని (Nizamabad) శ్రీ విద్యా పబ్లిక్ స్కూల్ 1996–97 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 29ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు.
Nizamabad Alumni Reunion | అంతా ఒక్కచోట చేరి..
నగరంలోని గంగాస్థాన్ బైపాస్ సమీపంలో డాక్టర్స్ కాలనీ సుహాన్సి రాయల్ బంకెట్ హాల్ వేదికగా ఈ రీ యూనియన్ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తమ గురువులు స్కూల్ కరస్పాండెంట్ రవి, ఉపాధ్యాయులు మల్లికార్జున్, జగదీశ్వర్, సాయన్న, నాగరాజు, మృత్యుంజయ, నారాయణ, చంద్రకళ, రాజేశ్వర్, భూమేశ్వర్, అటెండర్ అశోక్‌లను ఘనంగ సన్మానించారు. తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల ఆశీస్సులు పొందడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమతో పాటు చదువుకుని అకాల మరణం చెందిన సహచర మిత్రులు మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్, స్వప్న, సాయి కుమార్, వరలక్ష్మి , సుజాత జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఆనాటి అల్లరి.. కష్టసుఖాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా మళ్లీ ఒక్కటైన మిత్రులు, ముఖాలు మారినా మనసుల్లోని స్నేహబంధం మాత్రం చెరిగిపోలేదని చాటిచెప్పారు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్‌పై అభిమానం.. 70 ఏళ్ల వయస్సులో పొలిటికల్ ఎంట్రీ..!