అక్షరటుడే, నిజామాబాద్క్రైం: Gajula Soumya Tribute | విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. నగరంలోని (Nizamabad) డీపీఈవో(Nizamabad Excise Department) కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Gajula Soumya Tribute | అమరవీరు సంస్మరణ దినోత్సవాల సందర్భంగా..
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (DPEO) నందగోపాల్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో గాజుల సౌమ్య కనబర్చిన తెగువ, త్యాగం శాఖలోని ప్రతి ఒక్కరికీ నిరంతరం స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా పరిధిలో ఎక్సైజ్ నేరాలను మూలాల నుంచి సమూలంగా నిర్మూలించడానికి అధికారులు, సిబ్బంది పూర్తి అంకితభావంతో పనిచేయడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అమరురాలైన సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Gajula Soumya Tribute | సీఎంకు కృతజ్ఞతలు
బాధిత కుటుంబానికి సత్వర తోడ్పాటు అందించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ/ఎక్సైజ్), ఎక్సైజ్ కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (AAO) వి.నర్సయ్య, నిజామాబాద్ ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, ఎస్హెచ్శో సరిత, బోధన్ ఎస్‌హెచ్‌వో భాస్కర్ రావు, భీమ్‌గల్ ఎస్‌హెచ్‌వో చంద్రమోహన్, నిజామాబాద్ ఎస్సై సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే హెచ్‌సీ అండ్ ఈసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ. రవికుమార్, జోనల్ అధ్యక్షుడు పవార్ కైలాష్, జిల్లా అధ్యక్షుడు సునీల్ కుమార్, టీఎన్జీవోస్ (TNGOs) ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’ గొడవ!