Bribery Case | రూ.4 వేల లంచం కేసు.. 18 ఏళ్ల తర్వాత జీపీ కార్యదర్శికి జైలుశిక్ష

లంచం తీసుకుంటూ దొరికిన ఓ పంచాయతీ కార్యదర్శికి 18 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bribery Case | లంచాలు తీసుకుంటూ దొరికిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో జాప్యం జరుగుతోంది. దీంతో అవినీతి అధికారులు భయం లేకుండా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 2008 నాటి కేసులో ఓ అవినీతి అధికారికి తాజాగా జైలు శిక్ష పడింది.

వరంగల్ (Warangal) జిల్లా శాయంపేట పంచాయతీ కార్యదర్శిగా 2008లో కుర్రు కుమార స్వామి అనే వ్యక్తి పని చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక పశువైద్యశాల పనిచేస్తున్న భవనానికి సంబంధించి సుమారు రూ. 25,500 ఇంటి అద్దె బిల్లును తయారు చేయడం, చెక్కు జారీ చేయడం కోసం లంచం డిమాండ్​ చేశాడు. రూ.4 వేలు ఇస్తేనే ప్రభుత్వం నుంచి అద్దె బిల్లులు వచ్చేలా చేస్తానన్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా జీపీ కార్యదర్శి కుర్రు కుమారస్వామిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Bribery Case | ఏళ్ల తరబడి విచారణ

ఏళ్ల తరబడి సాగిన విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శి కుమార స్వామిని దోషిగా నిర్దారిస్తూ.. ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి, మూడవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి క్షమా దేశ్‌పాండే సోమవారం తీర్పు వెలువరించారు. నిందిత అధికారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *