Arnab Cyclone | దూసుకొస్తున్న తుపాన్​ ముప్పు.. రేపు తీరం దాటనున్న ‘అర్నబ్​’

అర్నబ్​ తుపాన్​ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arnab Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్​ తుపాన్​ తీరం దిశగా వేగంగా దూసుకొస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

తుపాన్​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం ఉదయం కోనసీమ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 200–250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తుపాన్​ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో అలల తాకిడికి తీరం కోతకు గురైంది. శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు.

Arnab Cyclone | రైళ్లు రద్దు.. బడులకు సెలవు

Arnab Cyclone

తుపాన్​ ఎఫెక్ట్​తో ఏపీలోని పలు జిల్లాల్లో రైళ్లు రద్దు చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం రూ. 27 కోట్లను విడుదల చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే 53 రైళ్లను రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీలలో సెలవులు ప్రకటించింది. అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ 27 నుండి 29 వరకు పాఠశాలలు మూసి ఉంచాలని ఆదేశించింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Arnab Cyclone | తెలంగాణలో..

తుపాన్​ ప్రభావం తెలంగాణపై సైతం ఉండనుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో అక్కడ వర్షాలు పడుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట కోతలు, ధాన్యం ఆరబోత సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండి..: KTR Lingannapeta Temple Visit | లింగన్నపేటలో లక్ష్మీవెంకటేశ్వర స్వామి దర్శించుకున్న కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *