Earphone Train Accident | ఇయర్​ ఫోన్లు పెట్టుకొని వెళ్తుండగా.. ఢీకొన్న రైలు

రైల్వే ట్రాక్​ పక్కన ఇయర్​ ఫోన్లు పెట్టుకొని ఫోన్​ మాట్లాడుతున్న వ్యక్తిని రైలు ఢీకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Earphone Train Accident | ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్​లో స్మార్ట్​ ఫోన్​ సాధారణం అయిపోయింది. చేతిలో ఫోన్​తో పాటు చెవుల్లో ఇయర్​ ఫోన్లు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా యువత ప్రయాణాల్లో సైతం ఇయర్​ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

వాహనాలపై, నడుచుకుంటూ వెళ్లే సమయాల్లో సైతం పలువురు ఇయర్​ ఫోన్లు పెట్టుకొని పాటలు వింటున్నారు. మరికొంత మంది ఫోన్లలో నిమగ్నం అయి లోకాన్ని పట్టించుకోకుండా ముందుకు కదులుతున్నారు. ఇంకొంత మంది ఫోన్లు మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఇయర్​ ఫోన్లు పెట్టుకొని ఫోన్​ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్​ పక్క నుంచి నడచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి రైలు వచ్చి అతడిని ఢీకొంది. ఇయర్​ ఫోన్ల వల్ల రైలు శబ్ధం వినిపించకపోవడంతో ఆ యువకుడు పక్కకు జరగలేదు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని బొల్లారంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నగర కమిషనర్​ సజ్జనార్​ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

Earphone Train Accident | ప్రాణాలను కబళించే తెర..

ఆధునికత పేరుతో చెవుల్లో పెట్టుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా… లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా అని సీపీ ప్రశ్నించారు. నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ ముఖ్యమ అన్నారు. ఇయర్​ ఫోన్లు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తాయన్నారు. బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశరాఉ.

Earphone Train Accident | ఆ అలవాటు మానుకోవాలి

డ్రైవింగ్​ సమయంలో ఫోన్​ మాట్లాడకపోతే ఏం కాదని, తర్వాత మాట్లాడుకోవచ్చిన సజ్జనార్​ పేర్కొన్నారు. కానీ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతే కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ముఖ్యంగా యువత రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు ఇయర్‌ఫోన్లు వాడే అలవాటును మానుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Retired SI Son Death | అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్​ ఎస్సై కుమారుడి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *