AssetMark Hyderabad GCC | హైదరాబాద్‌లో అసెట్‌మార్క్ భారీ జీసీసీ సేవలు ప్రారంభం.. 500 మందికి ఉద్యోగావకాశాలు..

అమెరికాకు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ 'అసెట్‌మార్క్' (AssetMark) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (GCC) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్డెస్క్: AssetMark Hyderabad GCC | అమెరికాకు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘అసెట్‌మార్క్’ (AssetMark) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (GCC) అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లోబల్ టెక్నాలజీ, ఐటీ ఇంజినీరింగ్, వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు , అంతర్జాతీయంగా తమ సేవలను పటిష్టం చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.

AssetMark Hyderabad GCC | 500 మందికి సీటింగ్..

హైటెక్ సిటీలోని హెచ్-10 బై ఫీనిక్స్ (H-10 by Phoenix) ఆవరణలో 500 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన ఆఫీస్ స్పేస్‌ను కంపెనీ లీజుకు తీసుకుంది. దశాబ్ద కాలంగా భారతదేశంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సేవలందించిన అసెట్‌మార్క్, ఇప్పుడు ఈ జీసీసీ ద్వారా నేరుగా సొంత బృందంతో కార్యకలాపాలు సాగించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు అవసరమైన టెక్ ప్రాజెక్ట్‌లను ఈ సెంటర్ నుండి పర్యవేక్షిస్తారు.

AssetMark Hyderabad GCC | టెక్నాలజీపై ఫోకస్..

హైదరాబాద్‌లోని  ( Hyderabad )ఈ నూతన కేంద్రానికి వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా జీసీసీగా జోషి ఆలపర్తి వ్యవహరిస్తారు. అమెరికా బృందాలతో కలిసి పనిచేస్తూ, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను జోడించి అడ్వైజర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, క్లయింట్ సేవలను మరింత వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

AssetMark Hyderabad GCC | భారీ స్థాయిలో నియామకాలు..

ప్రస్తుతం ఆపరేషన్స్, టెక్నాలజీ, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో వివిధ స్థాయిల్లో నిపుణుల నియామక ప్రక్రియను చేపడుతున్నారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) కాలేజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తొలి విడతలో 10 నుండి 15 మంది తాజా గ్రాడ్యుయేట్లను ఎంపిక చేయనున్నామని ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్‌లో అత్యుత్తమ టెక్నాలజీ , ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ఉన్నందున, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వృద్ధికి ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని అసెట్‌మార్క్ గ్రూప్ సీఈఓ లౌ మైయౌరీ (Lou Maiuri), సీఓఓ క్యారీ హ్యాన్‌సెన్ (Carrie Hansen) పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Seethakka Development Works | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *