అక్షరటుడే, ఎల్లారెడ్డి: Manjeera River Missing | మెదక్(medak) జిల్లాలోని మంజీరా నదిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో గల్లంతైంది. దీంతో ఎల్లారెడ్డి(Yellareddy) మండలం మల్కాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
Manjeera River Missing | ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (30) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డులో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (8), సంగిక (6) ఉన్నారు. అయితే ఆధార్‌లో మార్పులు చేయించుకునేందుకు ఆమె తన ఇద్దరు కుమార్తెలతో మల్కాపూర్‌కు వచ్చింది. కాని 26వ తేదీన ఇంట్లో నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది. దీంతో ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి వంతెన సమీపానికి చేరుకున్నట్లు తెలిసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన కుటుంబీకులకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారుల్లో వైష్ణవి ఐదో తరగతి, సంగిక నాలుగో తరగతి చదువుతున్నట్లు సమాచారం. తల్లి, ఇద్దరు చిన్నారులు ఒకేసారి గల్లంతయ్యారన్న వార్తతో మల్కాపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి : అర్నబ్ తుఫాను తీవ్ర రూపం.. 140 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం!