అక్షరటుడే, మెదక్ : Double Bedroom Houses | డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను 15 రోజుల్లో లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించారు. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాపై మంగళవారం సంగారెడ్డిలో సమీక్ష నిర్వహించారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని మంత్రులు అన్నారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్ కేటాయిస్తామన్నారు. భూముల శాటిలైట్ మ్యాప్‌లను పాస్ పుస్తకాల్లో ముద్రిస్తామని పేర్కొన్నారు. భూ భారతిలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిదశలో ప్రతి జిల్లాలోని 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అర్హులకు న్యాయం జరిగేలా భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Double Bedroom Houses | డబుల్ ఇళ్లపై..
బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇప్పటికే సుమారు 90 శాతం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించే ప్రక్రియ చేపట్టామన్నారు. మిగిలిన ఇళ్లను 15 రోజుల్లోగా అర్హులకు కేటాయించాలని ఆదేశించారు.
Double Bedroom Houses | తాగునీటికి ప్రాధాన్యం
ఎల్‌నినో నేపథ్యంలో నీటి లభ్యతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టులో నీటి సమస్య తలెత్తిందన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి లభ్యతకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండో పంట సాగుకు అవసరమైన నీరు, విద్యుత్‌ను సమకూర్చేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా, నీటి లభ్యతే ప్రధాన సమస్యగా మారనుందన్నారు.
దీనిని కూడా చదవండి : Illegal Water Business | అక్రమ నీటిదందాపై ఉక్కుపాదం.. మరో 7 బోర్లు సీజ్