Water Crisis | ఎల్​నినో ఎఫెక్ట్​.. స్విమ్మింగ్​ పూల్​ క్లోజ్​

ఎల్​నినో నేపథ్యంలో కోంపల్లిలోని ఓ అపార్ట్​మెంట్ వాసులు స్విమ్మింగ్​ పూల్​ మూసివేయాలని నిర్ణయించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Water Crisis | ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు విలాయతాండవం చేస్తోంది. రానున్న రోజుల్లో తాగునీటికి సైతం తిప్పలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జలమండలి అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వృథా చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్-నినో.. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాల తగ్గుదల, రానున్న నెలల్లో నీటి అవసరాలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అపార్ట్‌మెంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా నీటి పొదుపు చర్యలు చేపట్టింది. అపార్ట్​మెంట్ ఆవరణలోని స్విమ్మింగ్​పూల్​ను మూసి వేసింది.

Water Crisis | అభినందించిన ఎండీ

కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్‌ను తక్షణమే మూసివేయడంతో పాటు ఫ్లోర్ క్లీనింగ్, వాహనాల కడుగుదల వంటి అవసరం లేని కార్యకలాపాలకు నీటి వినియోగాన్ని నిషేధించాలని అసోసియేషన్​ నిర్ణయించింది. ఈ నిర్ణయాలపై జలమండలి ఎండీ అశోక్​రెడ్డి వారిని అభినందించారు. వ్యక్తిగత సౌకర్యాల కంటే తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇతర గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు కూడా తమ పరిధిలో నీటి వినియోగాన్ని సమీక్షించుకుని, వృథాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇది కూడా చదవండి..: CI Caught by ACB | కేసు క్లోజ్​ చేయడానికి రూ.6 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *