అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Forest Beat Officer Jobs | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ (Telangana) పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం 102 ఏఎస్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింది. నవంబర్‌లో అటవీ శాఖలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Forest Beat Officer Jobs | ఆ జిల్లాల్లో అధికం
మొత్తం 1,395 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 18 నుండి 31 ఏళ్లు ఉండాలి. (BC/SC/ST అభ్యర్థులకు 36 ఏళ్ల వరకు, దివ్యాంగులకు (PwBD) 41 ఏళ్ల వరకు సడలింపులు వర్తిస్తాయి). ఉద్యోగం సాధించిన వారికి నెలకు రూ.35 వేల నుంచి రూ.42 వేల వరకు జీతం అందుతుంది.
ఇది కూడా చదవండి..: Hitec City Traffic Loop | ఐటీ కారిడార్‌లో నిరంతర ప్రయాణమే లక్ష్యం.. కేబీఆర్ పార్క్ మోడల్లో వన్-వే లూప్ సిస్టమ్‌కు శ్రీకారం!