Israel Election Hung | ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్​..! కింగ్​ మేకర్​గా అరబ్ పార్టీలు

ఇజ్రాయెల్​ ఎన్నికల్లో హంగ్​ పరిస్థితి ఏర్పడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Israel Election Hung | ఇజ్రాయెల్​ ఎన్నికల్లో హంగ్​ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 89.8 శాతం ఓట్లు లెక్కించగా.. 120 మంది సభ్యులున్న క్నెసెట్‌లో బెంజమిన్ నెతన్యాహు కూటమి 53 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. యషార్ పార్టీ అధినేత గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకు ఇరుపక్షాలు దూరంగా ఉన్నాయి.

Israel Election Hung | అరబ్​ పార్టీల చూపు ఎటువైపు..?

ఎన్నికల కౌంటింగ్​లో బుధవారం స్పష్టమైన విజేత ఎవరూ తేలేదు. హంగ్​ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)ను అధికారం నుంచి తొలగించాలని కోరుకుంటున్న ప్రతిపక్ష పార్టీలకు, ఆయనకు మధ్య వారాల తరబడి సంకీర్ణ చర్చలు జరిగే అవకాశం ఏర్పడింది.

అరబ్ నేతృత్వంలోని పార్టీలు చారిత్రాత్మక విజయాలు సాధించినప్పటికీ, పార్లమెంటులో మెజారిటీ సాధించడానికి నెతన్యాహు ప్రత్యర్థులు వారితో కలిసి పనిచేయడానికి అంగీకరిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది.

Israel Election Hung | అరబ్ పార్టీల భాగస్వామ్యం తిరస్కరణ

దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా కొనసాగాలని ఆశిస్తున్న నెతన్యాహుకు.. 2022 ఎన్నికలతో పోలిస్తే ఆయన లికుడ్ పార్టీ మద్దతు కోల్పోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్ అనంతరం, అరబ్ నేతృత్వంలోని పార్టీలతో భాగస్వామ్యం ఏర్పరచుకునే అవకాశాన్ని ఆయన తిరస్కరించారు. అటువంటి సహకారాన్ని దేశద్రోహంగా అభివర్ణించారు. కాగా.. మరోవైపు ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 20 శాతం ప్రాతినిధ్యం ఉన్న ఈ పార్టీలు కూడా నెతన్యాహుతో భాగస్వామ్యాన్ని తోసిపుచ్చాయి.

ఇక నెతన్యాహూ ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్.. కొన్ని షరతులతో అరబ్ నేతృత్వంలోని పార్టీలతో పొత్తును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఆ పార్టీలు పలు షరతులు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Israel Election Hung | కింగ్​ మేకర్​గా..

120 మంది సభ్యులున్న క్నెసెట్‌లో నెతన్యాహు కూటమి 53 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా. యషార్ పార్టీ అధినేత ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 సీట్లు గెలుచుకునే ఛాన్స్​ ఉంది. మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 61 సీట్లకు ఇరుపక్షాలు దూరంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రధానంగా రెండు అరబ్ పార్టీలు 19 సీట్లు గెలుచుకుంటాయని అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ కింగ్​ మేకర్​గా మారాయి. గతంలో 15 సీట్లు సాధించగా.. ప్రస్తుతం 19 సీట్లు ఛాన్స్​ ఉంది.

Israel Election Hung | కొనసాగుతున్న కౌంటింగ్​..

కాగా.. సైనిక సిబ్బంది, దౌత్యవేత్తల ఓట్లతో సహా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు గురువారం సాయంత్రం వరకు కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. సుమారు 5 లక్షల బ్యాలెట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. ఇజ్రాయెల్ చట్టం ప్రకారం, అధికారిక ఫలితాలను నవంబర్ 4వ తేదీలోగా ధృవీకరించాలి.

ఇది కూడా చదవండి..: Trump Bans AI Term | AI కాదు.. ‘సూపర్ ఇంటెలిజెన్స్’!.. అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదంపై ట్రంప్​ నిషేధం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *