Jio Platforms IPO | ‘జియో’ అద్భుతం.. ఆరేళ్లలో రూ. 6,500 కోట్లకు పెరిగిన సంపద

జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి.. ఆరేళ్లలో మహేంద్ర నహతా కుటుంబానికి చెందిన సంపద విలువను ఏకంగా రూ. 6,500 కోట్లు పెంచింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో రికార్డులు సృష్టించింది. ఐపీవో అలాట్ అయినవారికి మంచి లాభాలను అందించింది.

Jio Platforms IPO | అప్పట్లో రూ. 10 కి కేటాయింపు..

భారత టెలికాం రంగంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన మహేంద్ర నహతా.. హెచ్ ఎఫ్ సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. కోల్‌కతాకు చెందినన ఈయన కుటుంబం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టిన పెట్టుబడికి ఏకంగా 136 రెట్ల లాభాలు వచ్చాయి. అదీ ఆరేళ్ల స్వల్ప వ్యవధిలో.. అప్పట్లో ఆయన కుటుంబానికి ఒక్కో షేరును రూ. 10 ల చొప్పున 4.787 కోట్ల షేర్లు కేటాయించారు. అంటే పెట్టుబడి రూ. 47.87 కోట్లు.. కంపెనీ షేరు ధర బుధవారం లిస్టింగ్ సమయంలో రూ. 1,358 గా ఉంది. దీంతో నహతా ఫ్యామిలీ సంపద ఆరేళ్లలో రూ. 6,450 కోట్లకుపైగా పెరిగింది.

Jio Platforms IPO | ఆ షేర్లు ఎలా వచ్చాయంటే..?

2010లో మహేంద్ర నహతా కుటుంబానికి చెందిన ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ అనే కంపెనీ దేశంలోని అన్ని సర్కిల్స్‌లో బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ గెలుచుకుంది. తర్వాత ఈ కంపెనీలో 95 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. రూ. 4,800 కోట్లు. ఇదే తర్వాతి కాలంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌గా మారింది. 2020 లో జియో ప్లాట్‌ఫామ్స్ కంపెనీలోని కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్లు ఆర్డినరీ షేర్లుగా మార్చారు. ఈ క్రమంలో నహతా కుటుంబానికి 4.787 కోట్ల షేర్లను కేటాయించారు. అప్పట్లో ఒక్కో షేరు విలువ రూ. 10.

Jio Platforms IPO | 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్

జియో ప్లాట్‌ఫామ్స్ కంపెనీకి చెందిన షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన విషయం తెలిసిందే. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 1,119కి విక్రయించగా.. 21.36 శాతం ప్రీమియంతో రూ. 1,358 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే ఒక్కో షేరుపై రూ. 239 వరకు లాభం వచ్చింది. ఒక లాట్ అలాట్ అయినవారికి రూ. 2,800 లకుపైగా లాభాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Today | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *