AI Journalism Books | కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మకమైన మార్పులు : తెయూ వీసీ

కృత్రిమ మేధస్సుతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెయూ వీసీ ప్రొఫెసర్​ యాదగిరి రావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: AI Journalism Books | కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెయూ వీసీ ​ యాదగిరి రావు పేర్కొన్నారు. ఈ మేరకు తెయూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ రచించిన పుస్తకాలను రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి ఆవిష్కరించారు.

AI Journalism Books | అభినందనీయం 

‘బియాండ్​ ది బైలైన్స్​ హౌ ద జర్నలిస్ట్​ అండ్​ ఏఐ షేప్​ ది న్యూస్​’ (Beyond the Bylines – How the Journalist and AI Shape the News) అలాగే ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ అండ్​ పబ్లిక్​ రిలేషన్ల్​’ (Artificial Intelligence and Public Relations) అనే రెండు పుస్తకాలను ప్రొఫెసర్​ ఘంటా చంద్రశేఖర్​ రాశారు. వీసీ యాదగిరి రావు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, జర్నలిజం, ప్రజా సంబంధాల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పరిశోధకులకు, మీడియా రంగంలోని వృత్తి నిపుణులకు ఉపయోగపడేలా పుస్తకాలను రచించడం అభినందనీయమన్నారు.

AI Journalism Books | సమకాలీన పరిణామాలకు అనుగుణంగా..

సమకాలీన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన అధ్యయన సామగ్రి అందుబాటులోకి రావడం అవసరమని వీసీ తెలిపారు. రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిజం, ప్రజా సంబంధాల రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన పెంపొందించడంలో ఈ పుస్తకాలు దోహదపడతాయని, యూనివర్సిటీ అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధన, రచనా రంగాల్లోనూ తమ సేవలను విస్తరించడం అభినందనీయమని పేర్కొన్నారు. పుస్తకాల రచయిత చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిజం, ప్రజా సంబంధాల రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, పరిశోధకులు, మీడియా నిపుణులకు అవసరమైన జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలను రచించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: TOMCOM Job Scam | ‘విదేశాల్లో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న మంత్రి’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *