PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

రాహుల్​ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Mahesh Goud | రాహుల్​ గాంధీ (Rahul Gandhi) అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్రం ఒత్తిడితో రైళ్లు కేటాయించడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమిత్ షా రాక వల్ల ప్రయోజనం ఏమి లేదన్నారు.

PCC Chief Mahesh Goud | బీజేపీ కంచుకోటలో గెలిచాం

రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం కాదని, ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమని మహేశ్ గౌడ్​ అన్నారు. బీజేపీ కంచుకోట అయిన నాగ్​పూర్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించాడని చెప్పారు. వారణాసిలో ఎస్పీ అభ్యర్థి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నాలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారన్నారు. నైతికత ఉంటే వీటిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. యువతలో మోదీ పాలనపై అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

PCC Chief Mahesh Goud | కొండా సురేఖకు అండగా ఉంటాం

ఎల్​నినో ప్రకృతి విపత్తు అని మహేశ్​ గౌడ్​ అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని హరీశ్​రావుకు హితవు పలికారు. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు బండకేసి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండ సురేఖకు బాసటగా ఉంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: AI Journalism Books | కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మకమైన మార్పులు : తెయూ వీసీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *